డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి..

25
Minister IK Reddy

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పిటిసి లోలం కళావతి, మాజీ జడ్పి చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బిలోలి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.