దర్శకుడు పూరీ జగన్నాధ్ హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈమూవీ ఘన విజయం సాధించింది. బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈమూవీ హిట్ కావడంతో పూరీ చాలా హ్యాపిగా ఉన్నాడు. ఈచిత్రానికి ఛార్మీ నిర్మాతగా వ్యవహరించారు. ఈనెల 28న పూరీ జగన్నాధ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని 10 ధియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ రీ రిలీజ్ చేశారు. అంతేకాకుండా కొంత మంది పేదలకు ఆర్ధిక సాయం చేశారు నిర్మాత ఛార్మీ.
పూరీ బర్త్ డే సందర్భంగా అద్భుతమైన గిప్ట్ ఇచ్చాడు హీరో రామ్. గోల్డ్ ఫాంటమ్ వైర్ లెస్ స్పీకర్ ను పూరీ జగన్నాథ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. తాజాగా ఈస్పీకర్ లో ఇస్మార్ట్ శంకర్ పాటలు వింటూ ఎంజాయ్ చేశారు పూరీ జగన్నాథ్. ఈ స్పీకర్ లో ఇస్మార్ట్ శంకర్ పాటలు వింటు ఎంజాయ్ చేస్తున్న పూరీని వీడియో తీసి ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది ఛార్మీ. ఈ స్పీకర్ ఖరీదు దాదాపు 4 వేల డాలర్స్ ఉంటుందని తెలుస్తుంది.
పూరీ జగన్నాథ్ తర్వాతి మూవీ విజయ్ దేవరకొండంతో చేయనున్నాడు. ప్రస్తుతం పూరీ ఈమూవీకి సంబంధించి స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
Looooveeeee u our ustaaaad @ramsayz for this auwsum Bday gift to @purijagan .. he is flying high
@DEVIALET #goldphantom
pic.twitter.com/eo4205tbl6
— Charmme Kaur (@Charmmeofficial) September 30, 2019