తెలంగాణ నాదే..ఆంధ్రా నాదే..!

261
ram pothineni
- Advertisement -

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చేసిన ట్వీట్ నెటిజన్ల మనసును గెలుచుకుంది.

ఏపీలో కియా మోటార్స్ వెహికిల్ లాంచ్‌పై హర్షం వ్యక్తం చేశాడు. నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్.. నువ్వు చెయ్.. నీకు ఇస్తా ఓ ట్వీటు.. ఆంధ్ర నాదే.. తెలంగాణ నాదే.. ఇదే మాట మీదుంటా! ఇక్కడ కులం లేద్.. ప్రాంతం లేద్.. డిస్కషన్ అస్సల్ లేద్!’’ అంటూ రామ్ పేర్కొన్నాడు.

రామ్ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. రీల్ హీరోలంతా రామ్‌ను చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మొత్తంగా సినిమాలతోనే కాదు తన మంచిమనసుతో నెటిజన్లను ఫిదా చేశారు రామ్‌.

- Advertisement -