ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే పరీక్షలలో ఫెయిలయ్యామని, అనుకున్న వాటికంటే తక్కువ మార్కుటు వచ్చాయని కొందరు విద్యార్థులు బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు విద్యార్థులకు ధైర్యం చెబుతున్నారు.
ఎన్ని బాధలు వచ్చినా,కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొవాలి కానీ ఆత్మహత్య చేసుకోకూడదని దర్శకుడు మారుతి, హీరో రామ్‌లు సోషల్ మీడియా వేదికగా విద్యార్ధులకు ఎంతో ధైర్యన్ని ఇచ్చారు. ఇదే కోవాలో తాజాగా న్యాచురల్ స్టార్ నాని తన ట్విట్టర్‌లో విద్యార్ధులని ఉద్దేశించి భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు.
నాని ట్వీట్.. చదువు అంటే మార్కుల పత్రాలపై నెంబర్లు కాదు. నేర్చుకోవటం మాత్రమే. నువ్వు అర్హత సాధించని ప్రతీ సారి తిరిగి పోరాటం చేయి. అస్సలు వదలొద్దు. వీటన్నింటికంటే జీవితం చాలా ముఖ్యమైనది. మీ తల్లితండ్రుల గురించి, మిమ్మల్ని ప్రేమించే వారి గురించి ఒక్కసారి ఆలోచించండి. వారు ప్రేమించేది మీ ఇంటర్మీడియెట్ రిజల్ట్స్‌ని కాదు.. కేవలం మిమ్మల్ని చూసి అంటూ నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Education means learning. It's not a number on the marks sheet.
Fight back when u don’t get what u deserve.U cannot give up!
Life is so much more than all this.Think about ur parents and all the loved ones.They don’t love u for what ur intermediate results are..they just love U!— Nani (@NameisNani) April 25, 2019