ఫిక్సయిపో.. సినిమా బ్లాక్‌బస్టర్‌- హీరో నాని

330
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తోన్న చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బాస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్మాణ కాంబినేషన్‌లో వస్తున్న‘టక్‌ జగదీష్‌’పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 23న సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా ట‌క్ జ‌గ‌దీష్‌ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ 13న విడ‌ద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. ‘ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 1న ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో..

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘సినిమా ఫైన‌ల్ క‌ట్ చూసుకున్నాం కాబ‌ట్టి టీమ్ అందరిలో తెలియని ఓ ఎగ్జ‌యిట్మెంట్ నిండిపోయింది. ఎడిట్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే ఫంక్ష‌న్‌లో ఎలా మాట్లాడుతామో.. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో అలా మాట్లాడాను. ఫిక్సయిపో..బ్లాక్‌బస్టర్‌ అని చెప్పాను. అలాంటి ఓ ఎగ్జ‌యిట్‌మెంట్ మా అంద‌రిలో ఉంది. కెరీర్‌ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఈ ఏప్రిల్ నెల‌కు ట‌క్ జ‌గ‌దీష్ మంత్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టాం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చాలా కార్య‌క్ర‌మాలున్నాయి. ఈ స‌మ్మ‌ర్‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు చాలా కీల‌కం అనే సంగ‌తి తెలుసు. అంద‌రం కోవిడ్ నుంచి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకెళుతున్నాం. ఈ ఏప్రిల్‌లో విడుద‌ల కాబోయే వ‌కీల్‌సాబ్‌, ల‌వ్‌స్టోరి, ట‌క్ జ‌గ‌దీష్‌, విరాట‌ప‌ర్వం, అలాగే రాబోయే ఆచార్య‌, నార‌ప్ప సినిమాలన్నీ పెద్ద స‌క్సెస్ అయ్యి.. ఈ స‌మ్మ‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీకి స్పెష‌ల్ స‌మ్మ‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఇది మ‌న తెలుగు సినిమా, మ‌న నెటివ్ సినిమా. మ‌న మ‌ట్టి వాస‌న ఉన్న సినిమా అనేలా ఫ్లేవ‌ర్‌తో రేర్‌గా సినిమా వ‌స్తుంటుంది. ఫుల్‌ ఎమోషనల్‌ డ్రామా. మన తెలుగు సినిమా. పదిహేనేళ్ల క్రితం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కోసం మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవాళ్ల‌మో అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఇచ్చే సినిమా ‘టక్‌ జగదీష్‌’. అంద‌రితో క‌లిసి ఫ‌స్ట్ డే మార్నింగ్ షో చూసే వర‌కు ఈ ఎగ్జ‌యిట్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది.

సినిమాలోని ఓ రా నెస్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ ప్ర‌సాద్‌గారు అద్భుతంగా చిత్రీక‌రించారు. రియ‌లిస్టిక్‌గా ఉంటూ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. రేర్‌గా కుదిరే సినిమా. త‌మ‌న్‌తో ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌ని అనుకుంటున్నాం. ఇప్ప‌టికీ కుదిరింది. ఈ సినిమాకు త‌నకంటే బెస్ట్ సంగీతం ఎవ‌రూ చేయ‌లేర‌న‌పించేలా మ్యూజిక్ ఇచ్చాడు. క‌థ‌లో ఎమోష‌న్స్‌ను అర్థం చేసుకుని త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. సినిమా చాలా బాగా ఉంది. ల‌డ్డులా ఉంటుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వస్తుంది. కానీ టీజర్‌లో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ట్రైలర్‌లో మంచి డైలాగ్స్‌ ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా మా సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్‌ 13న వైజాగ్‌లో విడుదల చేస్తున్నాం. టీజ‌ర్‌కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంతోషాన్ని ప్రేక్షకులకు ఇస్తుంది. అలాగే ఈ నెల 18న హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ప్లాన్‌ చేశాం. అలాగే త్వ‌ర‌లోనే ట‌క్ థీమ్‌‌ మ్యూజిక్‌ను విడుద‌ల చేసేలా కూడా ప్లాన్ చేశాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు..రెండు తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్ర‌మోష‌న్స్ చేయ‌బోతున్నాం. నిర్మాతలు సాహు, హరిష్‌ పెద్ది ‌ ఫుల్ స్వింగ్‌లో ప్ర‌మోష‌న్స్ ప్లాన్‌ చేస్తున్నారు’’అన్నారు.

హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘ తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఫ్యామిలీ కూడా మిస్‌ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. నా కెరీర్‌లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీడ్రామాను తీస్తానో..లేదో తెలియదు. అందుకే నాకు ఉన్న అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాను.నేను ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్‌ని. నా జీవితంలోనే కాదు.. అంద‌రి ఫ్యామిలీస్‌లోని ఎమోష‌న్స్‌ను ఇందులో చూడొచ్చు. నానిగారు చాలా బాగా చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కోవిడ్‌ బ్రేక్‌ వచ్చింది. అయినా కూడా సరే.. కోవిడ్‌కు ముందు ఎలాంటి ఎనర్జీతో వర్క్‌ చేశామో, అంతే ఎనర్జీతో కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత షూట్‌ చేశాం. నిర్మాతలు హరీష్, సాహు బాగా హెల్ప్‌ చేశారు. టక్‌జగదీష్‌ సినిమాను చాలా రియలిస్టిక్‌గా తీశాం. ఈ సినిమా ఏ సినిమాకు ప్రేరణ కాదు. నాని సినిమా అంతటా టక్‌ లుక్‌లోనే ఎందుకు కనిపిస్తారు అనేది వెండితెరపై తెలుస్తుంది. తమన్‌ సూపర్భ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. కంటిన్యూ అవుతున్న తన సక్సెస్‌లో నా భాగం కూడా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తిరువేర్, ప్రవీణ్‌ మంచి క్యారెక్టర్స్‌ చేశారు’’ అన్నారు.

నిర్మాత సాహు గార‌పాటి మాట్లాడుతూ “ మా బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే నానిగారు ఓ సినిమా చేశారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన రెండో సినిమా ‘ట‌క్ జ‌గ‌దీష్‌’. ఫ్యామిలీ ఆడియన్స్‌కు యూత్‌కు.. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా తీశాం. ఏప్రిల్ 23న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాట్లాడుతూ ‘‘మజిలీ’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాను. అప్పటి నుంచే దర్శకుడు శివ నిర్వాణతో మంచి స్నేహం ఏర్పడింది. శివ అస్సలు కాంప్రమైజ్‌ కాడు. ఎలాంటి స్క్రిప్ట్‌కైనా, ఏ పాత్రకైనా న్యాయం చేయగల హీరో నాని. ఆ సత్తా నానిలో ఉంది. కెరీర్‌లో నాని మరింత ముందుకు వెళ్లాలి. గ్రేట్‌ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్‌ ఉన్న సినిమా టక్‌జగదీష్‌. సినిమా విడుదల అయిన కొంతకాలం తర్వాత కూడా ఈ సినిమాలోని పాటల గురించి, ఎమోషన్స్‌ గురించి, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అంత బాగా వచ్చింది సినిమా’’ అన్నారు

న‌టుడు ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘పుల్‌ఫ్యాక్డ్‌ ఎమోషన్స్, యాక్షన్‌ మిళితమైన ఉన్న సినిమా టక్‌జగదీష్‌. ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రమే కాదు అందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు.యాక్టర్‌ తిరువేర్ మాట్లాడుతూ ‘‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మాత హరీష్ పెద్ది, సినిమాటోగ్రాఫ‌ర్‌ ప్రసాద్‌ మూరేళ్ల, నటి శీరిష త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -