‘లవ్‌స్టోరీ’పై ఆసక్తికర ట్వీట్ చేసిన అక్కినేని హీరో..!

129
Naga Chaitanya
- Advertisement -

ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరీ’తో హీరో అక్కినేని నాగచైతన్య తన కెరీర్‌లో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో చైతూ.. రేవంత్‌ అనే మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆయనకు జోడీగా సాయిపల్లవి ఎప్పటిలాగానే తనదైన శైలిలో మెప్పించారు.

కాగా, ‘లవ్‌స్టోరీ’ విజయంపై తాజాగా నాగచైతన్య స్పందించారు. ఇంత మంచి హిట్ సినిమాను అందించిన టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. జీవితాంతం గుర్తుంచుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ‘లవ్ స్టోరీ’ అందించిందని చైతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా టీమ్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

కాగా, కుల వ్యవస్థపై సున్నితమైన అంశాలతో శేఖర్ కమ్ముల సినిమాను చక్కగా తెరకెక్కించాడు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ, దేవయానీ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించి.. తమ నటనతో మంచి మార్కులు కొట్టేశారు. పవన్‌ మ్యూజిక్‌తో మేజిక్‌ చేశారు.

- Advertisement -