ప్రేక్ష‌కుల న‌వ్వులే మాకు నిజ‌మైన సంక్రాంతి- హీరో టీమ్‌

67
- Advertisement -

అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మాత‌. జ‌గ‌ప‌తిబాబు, న‌రేశ్ ,బ్ర‌హ్మాజీ, మైమ్ గోపీ, రోల్ రిడా త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసేందుకు చిత్ర యూనిట్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా హీరో అశోక్ గ‌ల్లా మాట్లాడుతూ, మొద‌టి రోజు దేవీ థియేట‌ర్‌లో చూశాక ప్రేక్ష‌కుల పాజిటివ్ స్పంద‌న ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నా. అందుకే సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. నా ఇష్టం గ్ర‌హించి న‌న్ను ఇంత‌వ‌ర‌కు తీసుకువ‌చ్చిన అమ్మా, నాన్న‌ల‌కు థ్యాంక్స్‌. అలాగే ద‌ర్శ‌కుల‌ టీమ్‌కు థ్యాంక్స్‌. బ‌గ‌ప‌తిబాబుగారు చాలా బాగా చేశారు. బ్ర‌హ్మాజీ క్ల‌యిమాక్స్‌లో అదిరిపోయేలా న‌టించారు. అలాగే న‌రేష్‌, మైమ్ గోపీ, రోల్ రిడా పాత్ర‌లు ఎంత‌గానో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. నిధి ల‌క్కీచామ్‌గా త‌యారైంది. డాన్స్ ప‌రంగా నాకు విజ‌య్ శిక్ష‌ణ ఇచ్చాడు. ఆయ‌న చేసిన పాట‌ల‌కు థియేట‌ర్ల‌లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది అన్నారు.

నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా స్పందిస్తూ, నాకు రెండు రోజులుగా ఫీడ్‌బ్యాక్ వ‌స్తూనే వుంది. యూత్‌, ఫ్యామిలీ అంద‌రూ క‌లిసి చూసే సినిమా. థ్రిల‌ర్‌, కామెడీ సినిమాకు హైలైట్‌. ద‌ర్శ‌కుడు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీశాడు. ప‌బ్లిసిటీకి స‌మ‌యం లేకుండానే చేయాల్సివ‌చ్చింది. అయినా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ మ‌ర్చిపోయేలా చేసింది. ముందు ముందు మ‌రింత పిక‌ప్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. అన్నారు.

జ‌య‌దేవ్ గ‌ల్లా మాట్లాడుతూ, స‌మిష్టి కృషి వ‌ల్ల ఈ సినిమా విజ‌యం సాధించింది. అంద‌రి క‌ష్టం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది అని పేర్కొన్నారు.

జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ, నేను గ‌త 15 ఏళ్ళుగా థియేట‌ర్‌కు వెళ్ళ‌లేదు. ఈ సినిమా కోసం వెళ్ళి చూశాను. పెద్ద‌గా న‌వ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. మొద‌ట్లో ఈ సినిమా చేయ‌వ‌ద్ద‌ని అనుకున్నా. పెద్ద సినిమాల‌లో న‌టించిన నాకు కొత్త హీరో ద‌ర్శ‌కుడుతో చేయాల‌నిపించ‌లేదు. కానీ ప‌ద్మ‌గారు మా సోదిరికి ఒక‌టికి ప‌దిసార్లు ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుంద‌ని ఒప్పించారు. స‌రేలే చేద్దాం అని చేశాను. జ‌య‌దేవ్ నాకిష్ట‌మైన వ్య‌క్తి. ఇక సినిమా చేసేట‌ప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ ద‌ర్శ‌కుడు నా అంచనాల‌ను తారుమారు చేసి ప్రేక్ష‌కులు ఎంజ‌య్ చేసేలా చేశాడు. ఈ సినిమా చూశాక నేను చేసిన హ‌నుమాన్ జంక్ష‌న్ గుర్తుకువ‌చ్చింది. ఇలాంటివి తీయాలంటే ద‌ర్శ‌కుడు గొప్ప‌త‌నం చూపించాలి. హీరో అశోక్‌లో త‌ప‌న క‌నిపించింది. ఒక‌టికి రెండు సార్లు సీన్ బాగా వ‌చ్చేదాకా చేసేవాడు. ఇక న‌రేశ్ పాత్ర చాలా క్రూరంగా వుంది. ఒక‌ర‌కంగా జ‌ల‌సీ క‌లిగేలా ఆ పాత్ర చేసి మెప్పించాడు అని తెలిపారు.

శ్రీ‌రామ్ ఆదిత్య మాట్లాడుతూ, థియ‌ట‌ర్ల‌లో నిజమైన పండుగ‌లా వుంది. క‌ష్ట‌ప‌డి చేసినందుకు ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ మాకు చాలా సంతోషాన్ని క‌లిగించింది. మైమ్ గోపీ ఇంట‌ర్‌వెల్ సీన్ అద్భుతంగా పండించారు. న‌రేశ్‌గారు న‌ట‌న హాయిగా న‌వ్వించేలా చేశారు. ఇక అశోక్ ప‌డిన క‌ష్టం చ‌క్క‌గా క‌నిపించింది. నిధి చాలా నాచుర‌ల్‌గా చేసింది. బ్ర‌హ్మాజీ చివ‌రి 10 నిముషాలు హైప్ కు తీసుకెళ్ళాడు. ఆయ‌న పాత్ర రాసుకున్న‌పుడు డేట్స్ లేక‌పోయినా వేరే సినిమాకు స‌రిచేసి మాకు ఇచ్చారు. పాత్ర‌పరంగా ఆయ‌న గ‌ట్టిగా అరుస్తాడు. అది థియ‌ట‌ర్‌లో చూడాల్సిందే. ఇక నిర్మాత ప‌ద్మావ‌తి గారిలో సినిమా విడుద‌ల త‌ర్వాత నుంచి సంతోషం క‌నిపించింది. చాలా మంది ఆమెకు ఫోన్ల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌య‌దేవ్ గ‌ల్లా గారు మా వెనుక వుండి నడిపించారు. నేను నాలుగు సినిమాలు చేసినా ఈ సినిమాకు వ‌చ్చిన స్పంద‌న ఏ సినిమాకూ రాలేదు. అదిరిపోయింది. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాల‌నే సినిమా తీశాం. జ‌గ‌ప‌తిబాబుగారు రాజ‌మండ్రిలో కోవిడ్ టైంలో నీళ్ళ‌లో మున‌గాలి. ఆ సీన్ కు ఎదురు చెప్ప‌కుండా చేసేశారు అని తెలిపారు.

బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ, రెండున్న‌ర గంట‌లు ఏడుపులేకుండా హాయిగా న‌వ్వుకునేలా సినిమా వుంది. ఇలాంటి సినిమా థియేట‌ర్ల లోనే చూడాలి. హీరో మొద‌టి సినిమాలా క‌నిపించ‌లేదని అన్నారు.

నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతూ, అంద‌రి క‌ష్టానికి ప్రేక్ష‌కుల‌ ఆశీర్వాదాలు ద‌క్కాయి. క్వాలిటీ విష‌యంలో నిర్మాణ సంస్థ కాంప్ర‌మైజ్ కాలేదు. శ్రీ‌రామ్ ఆదిత్య స్ట‌యిలిష్‌గా బాగా తీశారు. నా కుటుంబంతో సినిమా చూసి ఎంజాయ్ చేశాను. అశోక్ కు మొద‌టి సినిమా చాలా కీల‌కం. దాన్ని స‌రిగ్గా ఉప‌యోగించుకున్నారు. జ‌గ‌తిబాబు చాలా కూల్‌గా క‌నిపిస్తారు. న‌రేశ్ అద్భుతంగా చేశారు. అని తెలిపారు.

న‌రేశ్ మాట్లాడుతూ, క‌థ చెప్పిన‌ప్పుడే మంచి సినిమా అని తెలుసు. డ‌బ్బింగ్‌లో కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఆ రిజ‌ల్ట్ థియేట‌ర్‌లో చూశాం. ఫ‌స్టాఫ్ ఎలా ముగిసిందో కూడా తెలీయ‌లేదు. వెంట‌నే ద‌ర్శ‌కుడిని హ‌గ్ చేసుకున్నా. కోడిపందాలు ఎంట‌ర్‌టైన్ ఇస్తాయి. ఇది సంక్రాంతి కోడి పందెంలాంటిది. హీరో టైటిల్ చూసి మాస్ సినిమా అనుకున్నారు. కానీ హిలేరియ‌స్ కామెడీ సినిమాగా ద‌ర్శ‌కుడు మ‌లిచారు. అంద‌రూ బాగా న‌టించారు. కామెడీ టైమింగ్ వున్న ఏ హీరో అయినా బాగా స‌క్సెస్ అవుతాడు. అమితాబ్‌లో అలా చూశాను. అశోక్ లో ఆ టైమింగ్ వుంద‌ని చెప్పారు.

రోల్‌రిడా మాట్లాడుతూ, థియేట‌ర్ల‌లో నిన్న చూశాక ప్రేక్ష‌కులు సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇచ్చార‌నిపించింది. టీజ‌ర్ నుంచి ఈ సినిమాపై న‌మ్మ‌కం పెరిగింది. జిబ్రాన్ సంగీతం, న‌టీన‌టుల అభిన‌యం హైలైట్ అయింది. ఇందులో నేను పాడిన `స్టెప్ చూపించిన చిరంజీవి బాస్‌, స్ట‌యిలిష్ చూపించిన ర‌జనీబాస్‌.. పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోందని తెలిపారు. ఇంకా మైమ్ గోపీ, కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ మాట్లాడారు.

- Advertisement -