క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఆది “బుర్ర‌క‌థ‌”

136
Burrakatha Movie

ఆది సాయికుమార్, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి జంట‌గా న‌టిస్తున్న చిత్రం బుర్ర‌క‌థ‌. పిల్లా నువ్వులేని జీవితం, ఈడో ర‌కం, ఆడో ర‌కం సినిమాల‌తో ర‌చ‌యిత‌గా పెద్ద విజ‌యాల్ని అందుకున్న డైమండ్ ర‌త్న‌బాబు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. దీపాల ఆర్ట్స్ ప‌తాకంపై బీర‌మ్ సుధాక‌ర్‌రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌కాంత్ దీపాలా, కిషోర్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, నైరాషా కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్‌భూప‌తి విడుద‌ల‌చేశారు. టీజ‌ర్‌ను ద‌ర్శ‌కులు అజ‌య్‌భూప‌తి, శివ‌నిర్వాణ ఆవిష్క‌రించారు.

దర్శకుడు డైమండ్ ర‌త్న‌బాబు మాట్లాడుతూ రెండు బ్రెయిన్‌లు ఉన్న ఓ యువ‌కుడి క‌థ ఇది. ఆ పాయింట్‌లో నుంచే వినోదం ప‌డుతుంది. రామ్‌, అభి పాత్ర‌లు విభిన్నంగా ఉంటాయి. ఆది ఈ పాత్ర‌ల‌కు వెయ్యి శాతం న్యాయం చేశాడు. తెనాలి రామ‌లింగ‌డి త‌ర‌హా పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపిస్తారు. ఫ‌స్ట్‌కాపీ త‌ర్వ‌లో రెడీ అవుతుంది. సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అని తెలిపారు. \

హీరో ఆది మాట్లాడుతూ డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అభి, రామ్ పాత్ర‌ల‌తో పాటు క‌థ విన‌గానే చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోష‌న్ ఉంటుంది. క్టైమాక్స్ బాగుంటుంది. డైలాగ్స్ బాగుంటాయి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ల‌వ్‌లీ, శ‌మంత‌క‌మ‌ణి సినిమాలు చేశాను. మ‌ళ్లీ సినిమాలో ఆయ‌న‌తో న‌టించాను. . నా పాత్ర ఎలా చేయాల‌నే విష‌యంలో చాలా స‌ల‌హాలు ఇచ్చారు. నేను బాగా న‌టించ‌డానికి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ర‌త్న‌బాబు కార‌ణం అని తెలిపారు.