తొలిరోజు నిరాశపర్చిన భారత్‌…

192
- Advertisement -

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలిరోజు అభిమానులను నిరాశపర్చింది. ఆటముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. తొలుతు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌(1),మురళీ విజయ్(9) నిరాశపర్చగా తర్వాత వచ్చిన కెప్టెన్ కొహ్లీ కూడా 9 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడంతో 46/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది.

india vs newzealand

ఈ దశలో రహానేతో కలిసిజట్టును గట్టెక్కించే భాద్యతను భుజాన వేసుకున్న పుజారా భారత్‌ స్కోరు 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. పుజారా (87: 219 బంతుల్లో 17×4) పరుగులు చేయగా… రహానె (77: 157 బంతుల్లో 11×4) పరుగులు చేశారు. నాలుగో వికెట్‌కి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.అయితే కీలక దశలో పుజారాను వాగ్నర్‌.. రహానెను పటేల్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ మళ్లీ తడబాటుకు గురైంది. రోహిత్‌ శర్మ (2) తనకు కలిసొచ్చిన మైదానంలో కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేక నిరాశపరచగా.. అశ్విన్‌ (26: 33 బంతుల్లో 4×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

india

ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్‌ సాహా (14), జడేజా (0) ఉన్నారు. కివీస్ బౌల‌ర్ల‌లో హెన్రీకి 3, జీతన్‌ పటేల్‌కు 2, వాగ్నర్‌, బౌల్ట్‌కు చెరో వికెట్లు తీసుకున్నారు.తొలి సెషన్‌లో భారత్‌ తడబాటుకు గురవగా.. రెండో సెషన్‌లో పుజారా, రహానె కివీస్‌ బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు. అయితే చివరి సెషన్‌ ముగింపులో న్యూజిలాండ్‌ బౌలర్లు వరుస వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు.

kolkatha

- Advertisement -