నంద్యాలలో రికార్డు పోలింగ్‌….

180
Heavy Security in Nandyal By-Election
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.  ప‌లుచోట్ల చిన్న చిన్న ఘ‌ర్ష‌ణ‌లు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. నంద్యాల అర్బ‌న్‌లో 70 శాతం వ‌ర‌కు పోలింగ్ న‌మోదైంది. గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో భారీగా పోలింగ్ న‌మోదైంది. దాదాపు 80 శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ న‌మోద‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు క్యూలో ఉన్న‌వారికి అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు.

ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషం. దాదాపు 255 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్  జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లలో చైతన్యం విరబూసిందనే చెప్పాలి. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకే 71.91 శాతం పోలింగ్‌ నమోదైంది.

పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. దీన్ని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఈ ఎన్నికను సీఈసీ కూడా పర్యవేక్షించింది. నియోజకవర్గంలో సుమారు 80 నుంచి 90 వరకు పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉండటంతో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పారా మిలటరీ బలగాలతో భద్రతను ఏర్పాటుచేశారు. ఈ నెల 28న నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వెలువడనుంది.

- Advertisement -