భారీ వర్షాలు..తెలంగాణ భవన్‌ని సంప్రదించండి

65
- Advertisement -

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండగా టూరిస్ట్ ప్రాంతాలన్ని జలదిగ్బందంలో మునిగిపోయాయి. కులు మ‌నాలీలో తెలుగు విద్యార్థులు చిక్కుకోగా వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్.

విద్యార్ధుల‌ ఆందోళ‌న‌లో ఉన్నారని…వారు అధైర్యపడొద్దని విద్యార్థుల‌ను క్షేమంగా తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ క‌మీష‌న‌ర్‌ను అల‌ర్ట్ చేశామ‌న్నారు. అయితే సాయం కావాల్సిన వారు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భ‌వ‌న్‌ను లేదా త‌మ‌ ఆఫీసును సంప్ర‌దించ‌గ‌ల‌ర‌ని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -