అరగంట నడక… లక్ష సంపాదన!

639
walking park
walking park
- Advertisement -

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా టైమ్ ఉండడం లేదు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు మనిషి జీవితం యాంత్రికం అయింది. యాంత్రిక జీవనంలో పడి మనిషి తన ఆరోగ్యం గురించి ఆలోచించడం మానేశాడు. ఆరోగ్యం అంటే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు.. వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం అంటే బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కేవలం ఓ అరగంట ప్రశాంతంగా నడవండి చాలంటున్నారు నిపుణులు. ఇక అన్ని వయసులవారూ చేయగలిగిన వ్యాయామం వాకింగ్ అనడంలో అతిశయోక్తి లేదు.

అంతే కాకుండా రోజు ఓ అరగంట నడిస్తే వైద్యపరమైన బిల్లులు చాలావరకు తగ్గుతాయని, ఏడాదికి 2,500 డాలర్లు అంటే రూ.లక్షా అరవై ఆరు వేలు వరకు సంపాదించుకున్నట్లేనని పరిశోధకులు వెల్లడించారు. వారంలో 5 రోజులు.. నెలలో 20 రోజులు అరగంట సేపు నడిస్తే చాలునని కూడా అమెరికాలోని రీసెర్చర్లు భరోసా ఇస్తున్నారు.

26 వేలమందికి పైగా మగవారిని, మహిళలను ఎనాలిసిస్ చేసినప్పుడు ఈ విషయం తేట తెల్లమైందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తన మ్యాగజైన్ లో పేర్కొంది.వాకింగ్ లేదా ఎక్సర్ సైజ్ లేకుండా ఇనాక్టివ్ గా ఉంటే ఏడాదికి 68 బిలియన్ డాలర్ల మెడికల్ బిల్లులు భరించాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. తాము రెండు గ్రూపులుగా వీరిని విభజించామని, ఓ గ్రూప్ 30 నిముషాలు వాకింగ్ చేస్తే..మరో గ్రూప్ దీనికి దూరంగా ఉందని వాకింగ్ చేసిన గ్రూప్ ఏడాదిలో 2,500 డాలర్లను సేవ్ చేయగలిగిందని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఇక-మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఎక్సర్ సైజ్ చేసినందువల్ల తగ్గిపోతాయట.

Also read:మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు:తలసాని

ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి వాకింగ్‌ బాగా తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వాకింగ్‌లో మనో వ్యధనుంచి విముక్తం చేసే లక్షణాలు ఉన్నాయని.. వాకింగ్‌లో లభించే తాజా గాలి, శరీరాన్ని ఉత్తేజితం చేయడమే కాకుండా, మెదడుకు బాగా ఆక్సిజన్‌ అందడంతో ఆలోచనలకు ఒక స్పష్టరూపం వస్తాయని స్పష్టం చేశారు.

Also Read:పూరి – ఛార్మి బంధానికి ఇదే కీలకం

- Advertisement -