భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం..

216
rains
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చాలా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని అండర్ పాస్ రహదారుల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకల నిలిపివేశారు.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజ్ ఘాట్ పరిసరల్లో వాన నీరు నిలిచింది. గత 24గంటల్లో 13.8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకాగా….ఈ సీజన్ లోనే ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

- Advertisement -