డేంజర్ మార్క్‌కు యమునా నది..

31
- Advertisement -

ఎడతెరపిలేని వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు రోడ్లన్ని చెరువులను తలపిస్తుండగా బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇక భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయి దాటి పొంగి ప్రవహిస్తోంది.

పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్‌ను దాటడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా యమునా నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read:‘లియో’ షూటింగ్ పూర్తి

హర్యానాలో భారీ వర్షాల నేపథ్యంలో హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. ఢిల్లీలో వరద పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేజ్రీవాల్ లోతట్టుప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు.

- Advertisement -