గ్రీస్‌ను ముంచెత్తిన వరదలు..

1
- Advertisement -

గ్రీస్‌ను అకాల వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో జలమయమైంది గ్రీక్ ఐలాండ్ పరోస్. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు ప్రభుత్వ అధికారులు సూచించగా మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు.

రాత్రి గ్రీక్ దీవులు పారోస్, మికోనోస్‌ను వరదలు ముంచెత్తాయి. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించిన సమాచారం ఇప్పటివరకు తెలియలేదు. సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పారోస్, మికోనోస్ నివాసితులకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారిచేసింది.

జాతీయ వాతావరణ సంస్థ (EMY) ప్రకారం ఈ తుఫాను గంటకు 74 కిలోమీటర్ల (46 మైళ్ల) వేగంతో గాలులతో కూడి “ప్రమాదకరం” గా మారిందని, మంగళవారం కూడా కొనసాగుతుందని వెల్లడించింది. పారోస్, మికోనోస్, రోడ్స్, కోస్, కలింమ్నోస్, సిమి, టిలోస్ దీవులలో పాఠశాలలు ముందు జాగ్రత్తగా మంగళవారం మూసివేశారు.

Also Read:మయాన్మార్ భూకంపం..ఇస్రో ఉపగ్రహ చిత్రాలు!

- Advertisement -