భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

37
- Advertisement -

రానున్న 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అలాగే, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే రెండుమూడు రోజుల్లో బలపడి వాయువ దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.

కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

Also Read:23 నుంచి శాస‌న‌స‌భ స‌మావేశాలు..

- Advertisement -