- Advertisement -
ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 3.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైఋతి బంగాళాఖాతం ప్రాంతాలలో 2.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- Advertisement -