హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిః మంత్రి ఎర్రబెల్లి

204
Minister errabelli dayakar
- Advertisement -

రేపటి నుంచి ప్రారంభంకాబోయే 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హన్మకొండలోని సి యస్ అర్ గార్డెన్ లో ఉపాధి హామీ, హరిత హర కార్యక్రమాల అమలు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, చల్లా ధర్మా రెడ్డి, తాటికొండ రాజయ్య, సతీష్ బాబు, పెద్ది సుదర్శన్ రెడ్డి,మేయర్ గుండా ప్రకాష్, జడ్పీ చైర్మన్లు సుదీర్ కుమార్, గండ్ర జ్యోతి, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, హరిత, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, సీపీ డా వి రవిందర్ లు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…హరితహరం కార్యక్రమాన్ని విజయంవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి హరితహారం కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. నాటిన మొక్కలను 100శాతం బతికించాలని ఆదేశించారు. ఎస్ ఆర్ ఎస్ పి, దేవాదుల ద్వారా రైతులకు నిరంతరం సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి కల్లాలను నిర్మించనున్నట్లు తెలిపారు.

- Advertisement -