భాగ్యనగరంలో భారీ వర్షం..

278

భాగ్యనగరంలో పలు చోట్ల గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి,కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, జేబీఎస్‌, కార్కానా, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, ఉప్పల్‌,మూసాపేట్‌, ఈసీఐఎల్‌, నాగారం, జవహార్‌ నగర్‌, కీసరలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

తెలంగాణకు రాగల మూడు రోజులు వర్ష సూచన ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.ఓ మోస్తారు నుంచి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ,రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.