హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..

207
rain
- Advertisement -

సోమవారం రాష్ర్ట రాజ‌ధాని హైదరాబాద్‌లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కాగా, ఉరుములు, మెరుపులతో వర్షపాతం నమోదైంది. ఉద‌యం నుంచి ఎండ దంచికొట్టింది. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డింది.

న‌గ‌రంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట‌, సికింద్రాబాద్‌, బోయిన్‌ప‌ల్లి, ఉప్ప‌ల్, తార్నాక‌, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట‌, సంతోష్ న‌గ‌ర్‌, కోఠి, మెహిదీప‌ట్నం, టోలిచౌకీ, ల‌క్డికాపూల్, సోమాజిగూడ‌, ఖైర‌తాబాద్, మియాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీతో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురియ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డి, వ‌ర్షం కురియ‌డంతో న‌గ‌ర ప్ర‌జ‌లు ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల జిల్లాలైన వికారాబాద్, మేడ్చ‌ల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వ‌ర్షం దంచికొట్టింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు.

- Advertisement -