ఈ వేసవి నిప్పులే!

22
- Advertisement -

ఎండాకాలం ప్రారంభం కాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేసవి నిప్పుల గుండంగా మారడం ఖాయమని…భానుడి ప్రతాపంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారనుందని హెచ్చరించింది.

నగరంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటడంతో వేసవి తాపం మొదలైంది. ఇందుకు దేశంలో ఎల్ నినో పరిస్థితులే కారణం అని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాకుండా రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది.

హైదరాబాద్ లో ఈసారి ఎండలు మండిపోయే ప్రమాదం ఉండటంతో ఇప్పటినుండే వేసవిని ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సాధారణం కంటే కనీసం 5 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదు అవుతోంది. ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ప్రాంతంలో దాదాపు 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువ. దీన్ని బట్టి ముందు ముందు టెంపరేచర్ టెంపర్ మామూలుగా ఉండదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -