పసుపును ఇలా కలిపి సేవిస్తే రోగాలన్నీ మాయం!

37
- Advertisement -

పసులు అనేది ప్రతి ఇంట్లో ఉండే వంటింటి పదార్థం. కూరలకు రంగు, రుచి, వాసనను కలిగించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని కేవలం వంటల్లోనే కాకుండా వివిధ రకాల వ్యాధులకు మెడిసిన్ మాదిరిగా కూడా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తూ ఉంటారు నిపుణులు. ఇంకా చర్మ సౌందర్యంలో పసుపు చేసే మేలు అంతా ఇంతా కాదు. పసుపులో కొద్దిగా నీరు కలుపుకుని ముఖానికి చర్మానికి రాసుకోవడం వల్ల నిగారింపు సొంతమౌతుంది. పచ్చి పసుపు లో లిపో పాలిసాకరైడ్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడం తో పాటు ఫ్రీరాడికల్స్ తో వ్యతిరేకంగా పోరాడుతుంది. .

పచ్చి పసుపు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల సీజనల్ గా వచ్చే ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఇక పసుపు ను వివిధ రకాల పదార్థాలతో కలిపి సేవిస్తే మరిన్ని ప్రయోజనలు కలుగుతాయట. వేడి నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని సేవిస్తే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు దురమౌతాయట. ఇంకా ఉదయాన్నే పడగడుపున వేడి వేడి పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:రాజ్యసభకు రేణుకా,అనిల్ యాదవ్

ఇంకా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట. పసుపు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క వంటి వాటిని మిశ్రమంగా దంచుకొని ఒక చెంచా తేనెలో కలుపుకుని సేవిస్తే తుమ్ములు, జలుబు, ఆయాసం వంటివి తగ్గుముఖం పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేపాకుతో కొద్దిగా పసుపు కలుపుకొని మెత్తగా నూరుకోని చర్మానికి రాసుకొని ఒక అరగంట తరువాత స్నానం చేస్తే గజ్జి, తామరా, దురద వంటి వ్యాధులు దూరమౌతాయి. ఉసిరి కాయ రసంలో కొద్దిగా పసుపు కలుపుకుని సేవిస్తే, మూత్ర సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఇలా పసుపు వల్ల ఎన్నో ఉపయోగాలు కలవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:ప్రభాసే నా క్రష్ – పీవీ సింధు

- Advertisement -