రాజ్యసభకు రేణుకా,అనిల్ యాదవ్

16
- Advertisement -

తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. మూడు స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకాచౌదరితో పాటు యువజన కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సీటు దక్కింది.

వాస్తవానికి రేణుకా చౌదరి ఖమ్మం లోక్ సభ నుండి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఆమెను రాజ్యసభకు పంపారు. ఖమ్మం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి సోదరుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.అలాగే భట్టి విక్రమార్క సతీమణి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.వీరికి రేణుకా నుండి గట్టి పోటీ నెలకొనగా ఆమెను రాజ్యసభకు పంపడంతో కొంత పోటీ తగ్గిందనే చెప్పుకోవాలి.

Also Read:బొల్లి మచ్చలకు పరిష్కారం ఉందా?

- Advertisement -