అనారోగ్యం బారిన పడిన వారికి వైద్యులు ఎక్కువగా సూచించే పండ్లలో దానిమ్మ పండు ముందు వరుసలో ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతే కాకుండా ఈ పండు తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పోషణ అందివ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వైద్యులు దానిమ్మ పండును ఎక్కువగా సిఫారస్ చేస్తుంటారు. అయితే ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయో అవేంటో తెలుసుకుందాం !
దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ ఏ, కె వంటి వాటితో పాటు బి కాంప్లెక్స్ కూడా అధికంగా ఉంటుంది. ఇంకా వీటితో పాటు పొటాషియం, కాల్షియం, పీచు వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఫ్లెవనాయిడ్లు అధికంగా ఉంటాయి, అందువల్ల మన శరీరంలో వచ్చే చాలా సమస్యలకు దానిమ్మపండు చక్కటి నివారణగా ఉపయోగ పడుతుంది. ప్రతిరోజూ దానిమ్మ రసం తాగడం వల్ల హపర్ టెన్షన్ దురమౌతుంది. తద్వారా గుండె సమస్యలు దరిచేరవు. డయబెటిస్ ఉన్నవారు తప్పని సరిగా ప్రతిరోజూ దానిమ్మ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఇంకా దానిమ్మ జ్యూస్ ప్రతిరోజూ తాగితే అజీర్తి, కడుపునొప్పి, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు కూడా దురమౌతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రరోజు ఈ పండు జ్యూస్ తాగితే రక్త హీనత సమస్య ఉండదు. ఇంకా వివిధ రకాల నోటి సమస్యలకు కూడా దానిమ్మ చెక్ పెడుతుందని అద్యయానాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం పూట దానిమ్మ జ్యూస్ తాగి వ్యాయామం చేస్తే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుందట. ఇంకా మతిమరుపు ఉన్నవాళ్ళు దానిమ్మ జ్యూస్ క్రమం తప్పకుండా సేవిస్తే జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:నయా దేశ్‌ముఖ్..రేవంత్ రెడ్డి