గోధుమగడ్డి రసం తాగితే ఎన్నో ప్రయోజనాలో!

82
- Advertisement -

మనదేశంలో ఎక్కువగా పండించే ఆహార దన్యాలలో గోదుమ కూడా ఒకటి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గోదుమలను అధికంగా పండిస్తుంటారు. ఎందుకంటే వారి ప్రధాన ఆహార పదార్థాలన్నీ గోదుమలతోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా గోదుమలను బీరు, వోడ్కా, వంటి ఆల్కహాలిక్ పానీయాలలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇక గోదుమలతో తయారు చేసే చేపాతీలు, రొట్టెలు వంటివి ఎంతోమందికి ఇష్టమైన ఆహారం. గోదుమలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాగా కేవలం గోదుమలే కాకుండా గోదుమ మొక్కల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గోదుమ రసాన్ని సేవించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కీళ్లవాతం, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవాళ్ళు నిత్యం గోదుమరసం తాగితే ఆ వ్యాధులన్నీ మటుమాయం అవుతాయట..

గోదుమరసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా ఒక పాత్రలో మట్టిని నింపుకొని వాటిలో గోదుమ గింజలు వెదజల్లి నీటిని నింపాలి. తరువాత 6-7 రోజుల్లో ఆ గింజలు మొలకలు రావడం జరుగుతుంది. ఆ మొలకలను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఒక గ్లాస్ లో తీసుకొని సేవించాలి. ఈ విధంగా వారానికి ఒకసారి గోదుమ రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఒక గ్లాసు గోదుమ రసంలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఇ, కె వంటి వాటితో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. గోదుమ గడ్డి రసం తాగడం వల్ల ఎర్రరక్తకణాల వృద్ది పెరుగుతుంది. అంతే కాకుండా అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. జీర్ణాశయంలో కొవ్వును కరిగిస్తుంది. తలసేమియా వ్యాధి గ్రస్తులకు గోదుమ గడ్డి రసం ఎంతో ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -