చేపలతో క్యాన్సర్‌ దూరం..!

423
- Advertisement -

క్యాన్సర్‌ ఆధునిక యుగంలో అందరినీ భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.51 కోట్ల మంది క్యాన్సర్‌ భారిన పడుతున్నారు. వారిలో సుమారు 82 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులతోపాటు తీసుకునే ఆహారం కూడా క్యాన్సర్‌ సోకడానికి కారణమవుతున్నా యని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఈ మహమ్మరి బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు పరిశోధకులు.. అదేంటంటే.. వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. వారానికి ఒకసారి చేపను తినేవారితో పోలిస్తే మూడు సార్లు తీసుకునేవారిలో పేగు క్యాన్సర్‌ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని ఈ పరిశోధన వెల్లడించారు. అన్ని రకాల చేపలను తీసుకోవడం మంచిదే అయినా నూనె అధికంగా ఉండే సాల్మన్‌, మాకరెల్‌ చేపల కంటే ఇతర చేపలు మరింతగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని తేలింది.

 

చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్‌ఏను ధ్వంసం చేయడం ద్వారా క్యాన్సర్‌కు దారితీస్తుందని గత అథ్యయనాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి.

తరచూ చేపలను తినేవారిలో పేరుగ క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని, ఆరోగ్యకర ఆహారంలో చేపలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ మార్క్‌ గుంటర్‌ అన్నారు. ప్రజలు పొగతాగడం మాని బరువును తగ్గించుకుని ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ కేసులను 40 శాతం వరకూ నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:న‌యా దేశ్‌ముఖ్..రేవంత్ రెడ్డి

- Advertisement -