వీటితో ఆరోగ్యం పదిలం!

20
- Advertisement -

ప్రస్తుతం వింటర్ సీజన్ కావడంతో తరచు అనారోగ్యానికి గురి కావడం సహజం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్, జలుబు.. వంటి ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని వ్యాధుల సంక్రమణకు దారి తీస్తాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులకు మెడిసిన్ కంటే వంటింటి చిట్కాలు అద్బుతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెక్క, అల్లం, తేనె వంటివి సీజనల్ వ్యాధులకు దివ్యఔషధంలా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లం, తేనె, చెక్క.. ఈ మూడింటిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. .

అందువల్ల దాల్చిన చెక్క, అల్లం మెత్తగా నూరుకోని ఆ మిశ్రమానికి కొద్దిగా తేనె జత చేసి కొద్దిగా ప్రతిరోజూ ఉదయం పూట పరగడుపున కొద్దికొద్దిగా సేవిస్తే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందట. ఇంకా ఈ మిశ్రమం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ మందిని వేధించే మలబద్ధకం, కడుపు నొప్పి, ఎసిడిటీ, ఉబ్బరం, వంటి సమస్యలు తగ్గుతాయట. ఇంకా ఈ మూడింటి కాంబినేషన్ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇంకా ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో కూడా అల్లం, చెక్క, తేనె ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటిని విడివిడిగా తీసుకోవడం కంటే కాంబినేషన్ లో తీసుకోవడమే మేలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -