40 రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తిచేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగులో మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు హరీష్. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి….ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ చాలా ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు హరీష్. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్లు ఇచ్చిందని చెప్పారు.