దేశంలో ఎయిమ్స్ తర్వాత నిమ్సే-మంత్రి లక్ష్మారెడ్డి

256
Health Minister Laxma Reddy
- Advertisement -

దేశంలో ఎయిమ్స్ తర్వాత నిమ్సే నెంబర్ వన్ దవాఖానా, ఇక్కడ అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. అందుకనుగుణంగా నిమ్స్ని ఆధునీకరిస్తూ, సదుపాయాలు కల్పిస్తూ కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నిమ్స్‌లో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ రెండో అంతస్థులో 128 స్లైస్ సిటి స్కాన్ మంత్రి శనివారం ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ, సదుపాయాలు, ఆధునిక పరికరాలు, అద్భుత వైద్య సేవలు వంటి అనేక అంశాల్లో దేశంలో ఎయిమ్స్ తర్వాత నిమ్సే నెంబర్ వన్ దవాఖానా అన్నారు. ప్రభుత్వ రంగంలో తెలంగాణ వచ్చిన తర్వాత నిమ్స్ని అత్యంతగా అభివృద్ధిపరిచామన్నారు. ఇప్పటి వరకు రూ.78 కోట్ల విలువైన అధునాత పరికరాలను నిమ్స్‌కు అందించాం. బెడ్ల సంఖ్యని పెంచాం. నిమ్స్‌లో 40 బెడ్ల సామర్థ్యం ఉన్న అత్యవసర విభాగాన్ని 90 బెడ్లకు పెంచాం.

Health Minister Laxma Reddy

అయినప్పటికీ మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతున్నది. కార్పొరేట్ దవాఖానాల కంటే కూడా ఖరీదైన వైద్య పరికరాలను నిమ్స్ కి సమకూర్చాం అని మంత్రి వివరించారు. ఈ మధ్యే ఎంఆర్ఐని కూడా ప్రారంభిచండం జరిగిందని మంత్రి తెలిపారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా, ప్రభుత్వం, కార్పొరేట్లలో ఎక్కడా లేని విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిటి స్కాన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

అంతేకాకుండా నిమ్స్‌లో త్వరలోనే ఓపీ, లివర్, కిడ్నీ విభాగాలకు అవయవ మార్పిడులకు ప్రత్యేకంగా నూతన భవనాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చిన్న పిల్లలకు సంబంధించి నీలోఫర్ దవాఖానాలో మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అక్కడ అత్యాధునిక సదుపాయాలు కల్పించడంతో కార్పొరేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళే వాళ్ళు కూడా నీలోఫర్నే ప్రిఫర్ చేస్తున్నారన్నారు. దీంతో నీలోఫర్‌పై భారం పెరుగుతున్నదన్నారు. నీలోఫర్ హాస్పిటల్‌పై భారం తగ్గించేందుకు వీలుగా నిమ్స్ లోనూ గైనిక్ , పెడియాట్రిక్ విభాగాలను ప్రారంభిస్తామన్నారు.

Health Minister Laxma Reddy

ఇక కోర్టు కేసుల వల్ల 3 వేల నర్సింగ్ పోస్టులు, వైద్యుల పోస్టుల పెండింగ్లో పడ్డాయని మంత్రి తెలిపారు. కొన్ని పదోన్నతులు కూడా అదే తరహాలో అపరిష్కృతంగా ఉన్నాయి. కోర్టు కేసులు పరిష్కారం అయిన వెంటనే అన్ని పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయాల్లాంటి దవాఖానాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం దారుణమని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. దీని వల్ల రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైనా సమస్యలుంటే వాటిని నేరుగా తమ దృష్టికి తేవచ్చని అన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆందోళనలు, ధర్నాల పేరుతో రోగులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఎంఎన్ జె దవాఖానాల్లోని పని చేస్తున్న కొందరి అంతర్గత వ్యవహారాలతో ఎంఎన్జెలో రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1996లోనే అప్పటి ప్రభుత్వం ఎంఎన్జెను అటానమస్ చేసిందని, స్వయం ప్రతిపత్తి వల్ల రోగులకు ఎలాంటి నష్టం లేదని మంత్రి తెలిపారు. ఎంఎన్జెకి 250 పోస్టులను కూడా ఇచ్చాం. కొత్తగా భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. నూటికి నూరు శాతం ఎంఎన్జెలో ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ వ్యాధిగ్రస్తుల నుంచి రూపాయి కూడా వసూలు చేయబోమని మంత్రి స్పష్టం చేశారు.

ఎంఎన్జె లో వైద్య సేవలను ఇంకా మెరుగు పరుస్తాం. అనవసర ఆపోహలతో రోగులను, సిబ్బందిని ఆయోమయానికి గురిచేసి గందరగోళం సృష్టిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా అనుమానాలుంటే తమ వద్దకు వచ్చి నివృత్తి చేసుకోవాలని ధర్నాలు చేస్తున్నవాళ్ళకి సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, రేడియాలజీ విభాగం అధిపతి డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ నగేశ్, ఆర్ఎంఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -