వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ తప్పనిసరి: శ్రీనివాస్ రావు

105
srinivasarao
- Advertisement -

కరోనా థర్డ్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు డీఎంహెచ్‌వో శ్రీనివాస్ రావు. మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రావు.. కొత్త వేరియంట్ ఎలా పని చేస్తుందో సరిగా చెప్పలేమన్నారు. రీ ఇన్ఫెక్షన్ కేస్ లు ఒమిక్రాన్ తో వెలుగు చూస్తున్నాయన్నారు. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని… రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్థ్యం ఉందన్నారు.

చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి…. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి టెస్టింగ్ ని పెంచుతామన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఒకరు పరిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని… 50% మాస్క్ ల వినియోగం పెరిగిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ని సైతం కోవిడ్ నియమాలు పాటించి నియంత్రించవచ్చన్నారు.

యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదు కాలేదని…ఇంట్లో బయటా ఎప్పుడు మాస్క్ ధరించాలన్నారు. భోజనం చేసేప్పుడు మాత్రమే మాస్క్ తీయాలని..ఒమిక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుందన్నారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని గుర్తించాల్సి ఉందన్నారు. 97%మందికి మొదటి డోస్ పూర్తయిందని…29 లక్షల మందికి నేటికి రెండో డోస్ డ్యూ డేట్ ముగిసిందన్నారు. 4.19 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఇప్పటివరకు ఇచ్చామన్నారు.

- Advertisement -