నైట్ కర్ఫ్యూ అవసరం లేదు: శ్రీనివాసరావు

72
dh
- Advertisement -

రాష్ట్రంలో నైట్ కర్ప్యూ విధించాల్సిన అవసరం లేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.16 శాతంగా ఉంద‌ని, ప్ర‌స్తుతం రాత్రి క‌ర్ఫ్యూ వంటి ఆంక్ష‌లు విధించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పాజిటివిటి 10 శాతం దాటితే రాత్రి క‌ర్ఫ్యూ వంటివి అవ‌స‌రం అవుతాయ‌ని కానీ గత వారం రోజుల్లో ఒక్క జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10 శాతం దాట‌లేద‌న్నారు.

మెద‌క్‌లో అత్య‌ధికంగా 6.45 శాతం, కొత్త‌గూడెంలో 1.14 శాతం పాజిటివిటీ రేటు న‌మోదైంద‌ని అన్నారు. జీహెచ్ ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు శ్రీనివాసరావు.

- Advertisement -