తెలంగాణలో ఒమ్రికాన్‌ వ్యాప్తి.. వచ్చే 4 వారాలు కీలకం..

110
- Advertisement -

జాతీయ స్థాయిలో ఆరోగ్య సూచిలో తెలంగాణ 3వ స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌ డీహెచ్ శ్రీనివాస రావు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గురువారం కోఠిలోని పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియెంట్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకం అని శ్రీనివాస రావు సూచించారు. ఇప్పటికే అన్ని దేశాలలో కేసులు పెరుగుతున్నాయి. యుఎస్, యూకే వంటి దేశాలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదు.. నిన్న ఒక్కరోజే యుఎస్ లో సుమారు 4.65 లక్షల కేసులు నమోదు అయ్యాయి.

అతి కొద్ది వారాల్లో గతంలో చూడని స్థాయిలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. 3వ వేవ్ కి పెరుగుతున్న కేసులు ఒక సూచిక. 3 వేవ్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది. డెల్టా కంటే ఒమిక్రాన్ 30 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కొత్త వారియెంట్ సోకిన 95% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. 10% మందిలోనే లక్షణాలు ఉంటన్నాయి. కొందరిలో తీవ్ర తలనొప్పి, నీరసం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. లక్షణాలు లేని వారికి టెస్ట్ లు చేసి వ్యాధి ఉందని ముద్ర వేయాల్సిన అవసరం లేదు. పాజిటివిటీ రేట్ 0.6 నుంచి పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ లోని కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో టెస్ట్ ల సంఖ్య పెంచబోతున్నాము.

డెల్టా, ఒమిక్రాన్ అని ఆలోచించవద్దు కోవిడ్ ఒకటే.నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలు 3వ వేవ్ కి ప్రారంభంగా నిలుస్తాయి. కొత్త సంవత్సర వేడుకలు కుటుంభం సభ్యుల మధ్య జరుపుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకల్లో పాల్గొనే వారి అప్రమత్తంగా ఉండాలి. ఒకేసారి లక్షల్లో కేసులు నమోదు అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. భయంతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 3 వేవ్ కోవిడ్ కి ఒక అంతంగా ఉంటుంది అని చెప్పాలి. 3 వేవ్ వల్ల దాదాపు కోవిడ్ నుంచి విముక్తి దొరుకుతుంది. త్వరలో భారత్ బయోటెక్ నాజర్ స్ప్రే అందుబాటులోకి రానుంది. మొల్ను ఫిరావిర్ కూడా అందుబాటులో వుంటుంది. వృద్దులకు బూస్టర్, చిన్నారులకు 1st డోస్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాము.

కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 1% మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బెడ్స్, ఆక్సిజన్ పెద్ద మొత్తంలో కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 62 ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. అందులో 3 కేసులు కాంటాక్ట్ లేకుండా వచ్చాయి. అన్ని శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సు చేయలేము. ఇంతకు ముందు కోవిడ్ వచ్చినా కొందరులో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ఉంది. 2 వేవ్ ల నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాము. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని డీహెచ్‌ శ్రీనివాస రావు తెలిపారు.

- Advertisement -