బాలీవుడ్‌లోకి ఖిలాడీ!

58
rt
- Advertisement -

ప్రస్తుతం భారతీయ సినిమాల్లో పాన్ ఇండియన్ సినిమాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలను పాన్ ఇండియన్ చిత్రాలుగా తీసేందుకు నిర్మాతలు సిద్ధం అవుతుండటంతో ప్రస్తుతం ఈ తరహ సినిమాల ట్రెండ్ పెరిగిపోగా తాజాగా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు మాస్ మహారాజా రవితేజ.

రవితేజ నటించిన ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుండగా యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్‌ని హిందీలో కూడా ఫిబ్రవరి 11న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నార్త్ ఇండియన్ సర్క్యూట్ లో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ విడుదల చేయనుంది.

రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడి’ని ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా, ఇందులో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -