పురాతన కాలం నుంచి భారతీయులు తమ వంటకాల్లో ‘పసుపు’ను ఎక్కువగా వాడుతున్నారు. అల్లం జాతికి చెందిన దుంప అయిన పసుపు మసాలా దినుసుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పలు అనారోగ్యాలకు ఇది ఔషధంగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన వంటింటి అల్మారాలో అందుబాటులో వుండే సంజీవిని లాంటి ఔషధాన్ని వదిలేసి మందుల కోసం వెంపర్లాడవద్దంటున్నాయి పరిశోధనలు. పాతకాలం నుంచి భారత సంప్రదాయంలో భాగంగావున్న పసుపు సూపర్ ఫుడ్ అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముత్యమంత పసుపుతో మేని ఛాయను పెంచుకోవచ్చంటారు.. అయితే పసుపుపై జరిగిన మరిన్ని పరిశోధనల్లో అది దివ్యౌషధం అని తేలింది.
పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
పసుపు ఉపయోగాలు :
* ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
* ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపసమనం కలిగిస్తుంది.
* పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
* ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.
* శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, శనగ పిండి, పసుపు వేసి బాగా కలియ తిప్పి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా వచ్చే ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా వంటివి తగ్గుతాయి.
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి దాన్ని టూత్ పౌడర్‌గా నిత్యం వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పిప్పి పళ్లు నివారించబడుతాయి.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్టయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది.
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపం వేస్తే దోమలను, కీటకాలను నిరోధించవచ్చు.
* రెండు లేదా మూడు టీస్పూన్ల పసుపును అన్నంతోగానీ, పాలలో గానీ కలిపి తీసుకుంటే పైల్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.
* ఒక కప్పు పెరుగులో 10 గ్రా. లేదా 2 టీ స్పూన్ల పసుపు చేర్చి తింటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు తగ్గిపోతాయి.
* మద్యం ఎక్కువగా సేవించే వారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 5 గ్రాముల పసుపును ఒక గ్లాస్ నీటిలోగానీ, మజ్జిగలో గానీ కలిపి నెలరోజుల పాటు తాగితే లివర్‌కు ఏ ప్రమాదం సంభవించకుండా ఉంటుంది.
* రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం, రోగ నిరోధకశక్తిని పెంచే గుణం పసుపుకు ఉంది.
ఇవి కూడా చదవండి..