గోదుమల గురించి మనందరికి తెలిసే ఉంటుంది ఫైబర్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలలో గోదుమలు కూడా ఒకటి. అనారోగ్య బాధితులకు ఎక్కువగా గోదుమతో చేసిన రొట్టెలను తినమని చెబుతూ ఉంటారు వైద్యులు. ఎందుకంటే గోదుమలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే కేవలం గోదుమలు మాత్రమే కాకుండా గోదుమగడ్డిలోనూ మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. గోదుమగడ్డిని జ్యూస్ చేసుకొని తాగితే పలు ఆరోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు శరీరానికి మంచి పోషకాలు కూడా లభిస్తాయట. .
గోదుమగడ్డిలో విటమిన్ ఏ, ఇ, కె, బి కాంప్లెక్స్ మెండుగా ఉంటాయట. అంతేకాకుండా అమైనో యాసిడ్స్, క్లోరోఫిల్, వంటివి కూడా ఉంటాయి. ఇంకా యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా గోదుమగడ్డిలో సమృద్దిగా ఉంటాయట. అందువల్ల గోదుమగడ్డి రసం తాగితే ఈ ప్రయోజనలన్నీ పొందవచ్చట. ముఖ్యంగా గోదుమగడ్డి రసం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందట. తద్వారా అజీర్తి, మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దురమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి గోదుమగడ్డి బెటర్ ఆప్షన్ గౌంటుందట.
ఎందుకంటే సహజంగానే ఇందులో ఉండే ఫబర్ ఆకలి మందగించేలా చేస్తుంది. తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. ఇంకా ఈ రసం వల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య, తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుందని పలు అద్యయానల్లో రుజువైంది. ముఖ్యంగా కిమో థెరపీ సమయంలో గోదుమగడ్డి రసం తాగితే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే గుణాలు గోదుమగడ్డిలో ఉంటాయట. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వారంలో రెండు లేదా మూడు సార్లు గోదుమగడ్డి తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దురమౌతాయని నిపుణులు చెబుతున్నా మాట.
Also Read:చైతు ఎఫైర్ పై ‘సమంత’కు ప్రశ్న