వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

31
- Advertisement -

వేసవికాలం రానే వచ్చింది. ఎండలు తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎండాకాలం వచ్చిందంటే ప్రతిఒక్కరు కూడా శీతల పానీయాలు తాగడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వివిధ రకాల కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు, చేరుకురసం, లస్సీ.. ఇలా ఎన్నో రకాల పానీయాలు తాగుతూ సేద తీర్చుకుంటూ ఉంటాము. అయితే కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు వంటి వాటితో పోలిస్తే చెరుకురసం ధర తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువమంది చేరుకురసం తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ చెరుకురసం తాగడం వల్ల ఉపయోగాలు, నష్టాల గురించి మాత్రం చాలమందికి తెలియదు. చేరుకురసం తాగడం వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో, నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి అవెంటో చూద్దాం !

చెరుకురసంలో జీరో ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి.. అందువల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఇంకా మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి, మూత్రవిసర్జనకారిగా పని చేస్తుంది. ఈ వేసవిలో చాలమంది వివిధ రకాల మూత్రసమస్యలతో భాదపడుతుంటారు.. మూత్రవిసర్జనలో మంట, దురద వంటి సమస్యలతో సమతమతమౌతుంటారు. దీనికి కారణం శరీరంలో నీటి శాతం తగ్గడమే. కాగా చెరుకురసం శరీరంలో నీతిశాతాన్ని పెంచుతుంది. అందువల్ల మూత్రసమాస్యలన్నీ దూరమౌతాయి. ఇక చెరుకురసంలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇక పురుషుల్లో వీర్యకణాల వృద్దిని పెంచడంలోనూ, బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ చెరుకురసం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ఇక నష్టాల విషయానికొస్తే.. చెరుకురసంలో షుగర్ శాతం కాస్త ఎక్కువే.. అందువల్ల మధుమేహం ఉన్నవాళ్ళు చెరుకురసం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. సాధారణంగా చెరుకురసం రోడ్డు ప్రక్కల బండ్లపై తయారు చేస్తుంటారు. అందువల్ల దుమ్ము ధూళి చెరుకురసంలొ పడే అవకాశం ఉంది. తద్వారా ఆయా అనారోగ్య సమస్యలు తలెత్తుత్గాయి. ఇకా చెరుకురసంలొ వాడే ఐస్ ముక్కల విషయంలొ కూడా జాగ్రత్త వహించాలి. అవి స్వచ్చమైన నీటితో తయారు చేసినవా లేదా చెక్ చేసుకొని ఆ తరువాత చెరుకురసాన్ని సేవించాలి.

 Also Read:అక్కడ ఉప ఎన్నిక.. గెట్ రెడీ?

- Advertisement -