పొట్లకాయ రసంతోప్రయోజనాలు!

65
- Advertisement -

మనం ఆహార పదార్థాలుగా తీసుకునే కూరగాయలలో పోట్లకాయ ఒకటి. దీనితో చేసిన వంటకాలు ఎంతో రుచిని కలిగిస్తాయి. పొట్లకాయతో వేపుడు, కర్రీ, పచ్చడి వంటి వంటకాలను రుచికరంగా తయారు చేసుకొని అరగిస్తుంటారు. కాగా పొట్లకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో 98 శాతం నీరు ఉంటుంది. అంతే కాకుండా ఖనిజాలు, విటమిన్లు కూడా మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, వంటి వాటితో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయని నిపుణులు చెబుతున్నారు. .

అయితే పొట్లకాయను కూరల రూపంలో తినడం కంటే రసం రూపంలో సేవించడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయట. ప్రతిరోజూ ఉదయం పొట్లకాయ రసాన్ని తాగితే జీవక్రియ సాఫీగా జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పొట్లకాయ జ్యూస్ తాగితే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉందట. ఇంకా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయడంలో కూడా పొట్లకాయ రసం చాలా బాగా ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుందట. అయితే వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి మితంగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పొట్లకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికంగా పొట్లకాయ రసం సేవిస్తే.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంకా పొట్లకాయ రసం కాస్త చేదుగా ఉండడం వల్ల అలెర్జీ వంటివి కూడా దరిచేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్‌

- Advertisement -