Saffron:కుంకుమ పువ్వుతో ఆరోగ్యం….

285
- Advertisement -

కుంకుమ పువ్వు ఒక సుగంధ ద్రవ్యము….కుంకుమ పువ్వులో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా,తియ్యగా ఉంటుంది గర్భిణిస్త్రీలు ఈపువ్వును పాలలో వేసుకుని తాగితే పుట్టబోయే బిడ్డలు మంచిరంగుతో,ఆరోగ్యవంతంగా పుడతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, కుంకుమ పువ్వును ప్రతిరోజు తినడం వలన ఆరోగ్యంతో పాటూ, అందం కూడా పెరుగుతుంది.

కుంకుమ పువ్వులో పోషకాలు,ఆరోగ్యాన్ని పెంపొందించే రసాయనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వు వలన ఆరోగ్యానికి కలిగే  ప్రయోజనాలు చాలా ఉన్నాయి అవి:

కుంకుమ పువ్వును ఆహర తయారీలో వాడటం వలన రోగ కారకాలకు వ్యతిరేఖంగా పనిచేసే ,రోగాల నుండి సంరక్షించేందేకు దోహదపడుతుంది.

కుంకుమ పువ్వులో చాలా రకాల పోషకాలు ఉంటాయి వీటితో పాటూ, అస్థిర నూనెలు కూడా ఉంటాయి. అస్థిర నూనెలను ఆహరంలో కలపటం వలన ప్రత్యేకమైన రుచి,ఆహారానికి కారం కూడా అందిస్తుంది. ఈ అస్థిరమైన నూనెలలో ‘సినోల్’, ‘పినీన్’, ‘బోర్నేయోల్’, ‘గేరనోయిల్’ వంటి ముఖ్య రకాలు ఉంటాయి.

అస్థిర నూనెలతో పాటూ, నాన్- వోలటైల్ ఆయిల్ (అస్థిరం కానీ నూనెలు) చైతన్యవంత మూలకాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో శరీరానికి ఉపయోగపడే కెరోటినాయిడ్ వంటి శక్తివంతమైన యాంటీ- ఆక్సిడెంట్’లు కూడా ఉంటాయి. ఫ్రీ రాడికల్ వలన కలిగే హానికర చర్యలు మరియు వ్యాధులను ఈ నాన్- వోలటైల్ కారకాలు అడ్డుపడతాయి.

Also Read:షాక్.. కరోనా కేసులు భారీగా పెరిగే ఛాన్స్‌..!

జియా-క్సాంతిన్, లైకోపీన్, ఆల్ఫా మరియు బీటా కెరోటినాయిడ్స్ వంటి కెరోటినాయిడ్ రకానికి చెందిన మూలకాలు కుంకుమ పువ్వులో ఉంటాయి.

కుంకుమ పువ్వులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ , ఎర్రరక్త కణాల ఉత్పత్తికి కుంకుమపువ్వు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.

కుంకుమపువ్వు మేనిఛాయను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా కుంకుమపువ్వును ఒక టేబుల్‌ స్పూన్‌ నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. నీరు ఎరుపుగా మారిన తర్వాత అందులో కొద్దిగా వెన్న వేసి పేస్టులా తయారేంతవరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే.. చర్మ ఛాయ మెరుగవుతుంది.

కుంకుమ పువ్వు, పసుపు, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే మొటిమలను, మచ్చలను దూరం చేసుకోవచ్చు.

చర్మ మృదుత్వం కోసం ఒక స్పూన్‌ కుంకుమ పువ్వు పొడి తీసుకుని అందులో కొన్ని చుక్కలు పాలు వేసి పేస్ట్‌లా కలియబెట్టాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే పసిడి ఛాయ మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

- Advertisement -