అంబలితో ఆరోగ్యం..

606
raagulu
- Advertisement -

వేడి గాలులు, మండే ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్నారు.వేసవి కాలంలో డీ హైడ్రేషన్ బారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

సమ్మర్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా.. సంగటి, అంబలి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం.జొన్నలు, రాగులతో చేసిన అంబలి లేదా సంగటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చు.

ఎన్నో రోగాలను తగ్గించేందుకు ఉపయోగపడే అత్యంత పోషక పదార్ధాలు రాగి సంగటిలో ఉన్నాయి.బీపి,షుగర్‌ తదితర వాధ్యులను కంట్రోల్‌ చేయడానికి రాగి ఎంతగానో ఉపయోగపడుతుంది.రాగిసంగటి తరచూ తీసుకోవడం వలన కడుపులో మంట, వాంతులు, వికారం, మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి దోహదపడుతుంది.మజ్జిగ, పాలలో రాగిమాల్ట్‌ను కలుపుకుని త్రాగితే సొరియాసిస్, చర్మవ్యాధుల నివారణకు మెడిసెన్‌లా పనిచేస్తుంది.

Also Read:చేప ప్రసాదం.. 32 కౌంటర్లు

రాగులను రోజూ వారీ డైట్‌లో చేర్చుకోడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చని న్యూట్రీషన్లు చెబుతున్నారు.రాగుల్లో యాంటీఆక్సిడెట్లు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.రాగుల్లో అమినోయాసిడ్స్‌ ఆకలిని తగ్గించి… బరువును నియంత్రిస్తుంది.రాగిపిండితో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది.

ఇంకా రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.మహిళలు ఎముకల పట్టుతత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది.సాధారణంగా రాగులతో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.ఆందోళన, వ్యాకులత, నిద్రలేమి పరిస్థితులను దూరం చేస్తుంది.రాగి మైగ్రేన్‌ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read:మిస్ వరల్డ్ వేదికకు సిద్ధమైన భారత్‌..

- Advertisement -