పుట్టగొడుగుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా లభించే ఈ పుట్ట గొడుగులలో చాలానే రకాలు ఉన్నాయి. దాదాపు 3000 వేలకు పైగా పుట్టగుడుగులలో రకాలు ఉన్నట్లు అధ్యయనలు చెబుతున్నాయి. అయితే వాటిలో అన్నీ తినడానికి పనికి రావు. అందులో ఎక్కువగా ” ఆగరికస్ బీస్పోరాస్ అనే జాతికి చెందిన పుట్టగొడుగును మాత్రమే తినడానికి ఉపయోగిస్తారు. దీనినే సాధారణ పుట్టగొడుగు అని అంటారు. అయితే పుట్టగొడుగులలో ఎలాంటి పత్రహరితం ఉండదు కాబట్టి. వీటికి రంగు ఉండదు. ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. .
ఇదిలా ఉంచితే పుట్టగొడుగులతో రకరాల వంటలు తయారు చేసుకొని ఆరగిస్తుంటాము. కర్రీ, సూప్, సలాడ్.. ఇలా రకరకాలుగా తయారు చేసుకోని తింటూ ఉంటాము. పుట్టగొడుగులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో శరీరానికి అవసరమైన పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇంకా విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ సి, వంటి వాటితో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా మెండుగా ఉంటుంది. కాబట్టి పుట్టగొడుగులను మంచి పౌష్టికాహారంగా చెబుతుంటారు న్యూట్రీషియన్స్. పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించే బీటా గ్లోకాన్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను ఆహార డైట్ లో చేర్చుకుంటే మంచిదట.
ఇంకా షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా పొట్టగొడుగులు చక్కటి ఔషధంల పని చేస్తాయట. వివిధ రకాల క్యాన్సర్ కరకాలను కూడా పుట్టగొడుగులు నివారిస్తాయని అధ్యయనలు చెబుతున్నాయి. అయితే పుట్టగొడుగులను అధికంగా తినడం వల్ల అంతకు మించి నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు శిలీంద్రాల జాతికి చెందినవి గనుక వీటిని ఎక్కువగా తింటే ఇమ్యూనిటీ డిజాస్టర్స్ ఏర్పడే ప్రమాదం ఉందట. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్నవారు.. పుట్టగొడుగులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎండిన పుట్టగొడుగులు ఆరోగ్యానికి ప్రమాదం అని పలు పరిశోదనల్లో వెల్లడింది. అంతే కాకుండా వీటిలో చాలానే రకాలు ఉన్నాయి కాబట్టి తినదగినవేవో, తినకూడనివేవో ఖచ్చితంగా తెలుసుకొని తినడం మంచిది. లేదంటే లేని సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:ఆర్ఆర్ఆర్‌ని బ్రేక్ చేసిన కల్కి!