కరివేపాకుతో ఉపయోగాలు..

5596
curry leaves
- Advertisement -

1.కరివేపాకు ముద్దగా నూరి టీ స్పూన్ చొప్పున ఒక గ్లాస్ మజ్జిగ తో లేదా గ్లాస్ నీళ్ళతో రెండుపూటల తీసుకుంటే స్థూలకాయం తగుతుంది. మధుమేహన్ని అధుపులో ఉంచుతుంది.

2.కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు నుండి ఉపశమనం పోందవచ్చు

3. ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, సీసాలో నిల్వచేసుకోవాలి. దీనిని ఉదయం సాయంకాలాలు భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.

4. కరివేపాకులను ముద్దగా నూరి 1-2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

5. కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి చపాతి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

6.కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా టీస్పూన్ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాల సమస్య తగ్గుతుంది అని ఆరోగ్చ నిపుణులు చెప్పుతున్నారు.

7. లేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆర్శమొలల్లో ఉపశమనం లభిస్తుంది

8.కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతోగాని కలిపి కళ్లకింద చర్మంమీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి.

Also Read:TS BJP:ఈటల వర్సెస్ జితేందర్ రెడ్డి

9.కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజూ మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమటవల్ల వచ్చే చెడు వాసన తగ్గుతుంది.

10.కరివేపాకు కాయల రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి ప్రయోగిస్తే నొప్పి, వాపు,ఎరుపుదనం వంటి లక్షణాలు,దద్దుర్లు కూడా తగ్గుతాయి.

 

- Advertisement -