సీజనల్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో లభించే సీతాఫలంతో ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. వంద గ్రాముల సీతఫలం గుజ్జు నుంచి సుమారు 100 కేలరీల శక్తి లభిస్తుంది. సీతఫలం ఎలాంటి మందులు లేకుండా సహాజగా పడుతుంది.
పచ్చి సీత ఫలకాయను ముద్దగా నూరితింటే వాంతులు, విరోచనలు తగ్గుతాయి.క్షయ వ్యాధికి సీతఫలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యులు సీతఫలం పండే కాలం లో ఈ పండు రసాన్ని తయారు చేసి క్షయరోగానికి ఔషదంగా వాడుతున్నారు .
సీతఫలం ఆకులు గాయలకి,పుండ్లకి లేపనంగా రాసుకుంటే అవి తగ్గుతాయి. సీతఫలంలో విటమిన్ ” సి”పుష్కలంగా లభిస్తుంది.సీత ఫలంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు కావలసిన వెూతాదులో ఉంటాయి. సీతఫలంలో పీచు పదార్ధలు ఉండటం వలన జీర్ణశక్తిని పెంచుతుంది.
సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేనుల సమస్య ఉండదు. సీతఫల ఆకుల పసరు తలకి మర్ధన చేస్తే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం పోందవచ్చు.సీతాఫలాల గుజ్జును జ్యూస్ లా చేసి పటికి బెల్లం లేదా చక్కెర లో వేసి పాలలో కలిపి పాలిచ్చే తల్లులు, ఎదిగే పిల్లలు తాగితే మంచిది.
జీర్ణ సంబంధ సమస్యలున్నవారు సీతాఫల పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.సీతాఫలంలోని గుజ్జును పాలతో కలిపి తాగితే శీరీరంలోని వేడి, అతి దాహం తగ్గుతాయి.సీతాఫలం గుజ్జుని పాలతో కలిపి తాగితే వేసవిలో దాహం వల్ల నోరు ఎండిపోడం తగ్గుతుంది.అలాగే డైటింగ్ చేసేవారు ఈ పండును క్రమంగా తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు.