క్యాబేజీ రసం తాగితే..ఎన్నో లాభాలో!

63
- Advertisement -

సాధారణంగా క్యాబేజీతో వివిధ రకాల రుచికరమైన కూరలు చేసుకొని తింటూ ఉంటాము. క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ కర్రీ, క్యాబేజీ రైస్,.. ఇలా చాలా రకాల వంటలనే చేస్తూ ఉంటారు. అయితే క్యాబేజీలో ఉండే వాసన కారణంగా కొంతమంది ఇది తినడానికి అసలు ఇష్టపడరు. కానీ క్యాబేజీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణుపు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాబేజీని జ్యూస్ రూపంలో తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. క్యాబేజీలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏ, ఇ, సి అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాస్ క్యాబేజీ జ్యూస్ తాగితే పలు రకాల అనారోగ్య సమస్యలు దురమౌతాయట. .

క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అల్సర్ అజీర్తి వంటి సమస్యలు దరి చెరకుండా చూస్తుంది. ఇంకా కడుపులో మంట, కడుపులో పూత వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.ఇంకా ప్రతిరోజూ క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల రక్త శుద్ది జరుగుతుంది అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో పొటాషియం కాల్షియం వంటి మూలకాలు ఉంటాయి వీటివల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.

ఇంకా క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ తో వ్యతిరేకంగా పోరాడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ రసం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రతిరోజూ క్యాబేజీ జ్యూస్ తాగి వ్యాయామం చేస్తే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉందట. ఇక సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి వాటిని నయం చేసుకునేందుకు క్యాబేజీ ఆకులను నమిలిన లేదా దాని యొక్క రసం తగిన ఆ సమస్యలు దురమౌతాయట. ఇంకా గొంతునొప్పి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాబేజీ రసాన్ని అలాగే తాగడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి అందులో కొద్దిగా పంచదార లేదా తేనె కలుపుకుని తాగితే బెటర్ అనేది నిపుణులు చెబుతున్నామాట.

Also Read:Imran Khan:ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

- Advertisement -