‘క‌ల్కి 2898’ కథ..రిలీజ్ డేట్ అదే

42
- Advertisement -

ప్రభాస్‌ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’టైటిల్ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది. కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ అవతరించి.. కలిని అంతమొందిస్తాడనే కథాంశంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రం రూపొందించడనే టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాలో కల్కిగా ప్రభాస్ కనిపిస్తుండగా.. కలిగా లోకనాయకుడు కమల్ హాసన్ నటించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పడుకోనే, అమితాబ్ బచ్చన్, దిషా పటానీ, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై దర్శక ధీరుడు రాజమౌళి స్పందిస్తూ కల్కి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ”నాగ్ అశ్విన్ గ్రేట్ జాబ్. . ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్‌. అయినా మీరు సాధించారు. డార్లింగ్‌(ప్రభాస్‌) లుక్స్‌ అదుర్స్‌. సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనే ఒక్క ప్రశ్న మిగిలుంది” అని రాజమౌళి పేర్కొన్నాడు.

Also Read:తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ..దాశరథి

అయితే, ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్ డేట్ పై ఇప్పటికే ఓ డేట్ గట్టిగా ప్రచారంలో ఉంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, మ‌హాన‌టి రిలీజైన మే 9నే క‌ల్కి సినిమాను కూడా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:మహాకవి దాశరథి: హరీశ్‌ రావు

- Advertisement -