తెలంగాణ ప్రభుత్వం క్రిడలకు పెద్దపీట వేస్తుందన్నారు హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, ప్యానెల్ సభ్యులు ఇవాళ కలిశారు. బుద్ధభవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు అజారుద్దీన్ తెలిపారు. నిన్న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ విజయం సాధించారు.
ఈసందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాలో యువత ట్యాంలెంట్ గుర్తించి క్రికెట్ లోకి తీసుకువస్తాం అని చెప్పారు. క్రికెట్ కు ప్రభుత్వం సహకారాన్ని అందించాలని మాత్రమే కేటీఆర్ ను కలిశానని తెలిపారు. సీఎం కేసీఆర్ కు కూడా కలిసి క్రికెట్ కు సహకారం అందించమని కోరతానన్నారు. పార్టీలకు అతీతంగా అందరిని కలిసి క్రికెట్ అభివృద్ధి పాటుపడేలా కోరుతాం అని చెప్పారు.