తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక..బతుకమ్మః సీఎం

386
Cm kcr BAtukamma
- Advertisement -

తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 8రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -