వివేక్‌పై అజారుద్దీన్‌ ఫైర్‌..

372
Mohd Azharuddin
- Advertisement -

HCA ఇంచార్జి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ తీరును HCA ఆఫీస్ బేరర్స్ ఖండించారు. ఈ సందర్భంగా శేష్‌ నారాయన్‌ మాట్లాడుతూ..హై కోర్ట్ నియమించిన అడ్మినిస్ట్రేషన్ అధికారుల ఆదేశాల మేరకు నిన్న AGM నిర్వహించాం. బీసీసీఐకి HCA నుంచి రిప్రసేంట్‌ని ఎన్నికల తర్వాత నియమించాలి అన్నారు.AGM లో మెజారిటీ ప్రకారం ఎన్నుకుంటారు. కానీ నిన్న ఇంచార్జీ ప్రెసిడెంట్ మీడియాకి తప్పుడు సమాచారం ఇచ్చారు.

వివేక్ వెంకటస్వామిని ఎన్నుకోలేదని శేష్‌ నారాయాన్‌ స్పష్టం చేశారు.10 మంది కుమ్మక్కై ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన మండి పడ్డారు. దీనిపై మేము లీగల్‌గా వెళ్తాము. నిన్న జరిగిన మీటింగ్ మినెట్స్ ప్రిపేర్ అయ్యాక మీడియాకు ఇస్తాం.తప్పుడు సమాచారంని మీడియా ప్రచారం చేయొద్దని వేడుకుంటున్నమని ఆయన అన్నారు.Agm లో మెజారిటీ సభ్యుల కోరిక మేరకు… సభ్యుల ఫామిలీకి ఇన్సూరెన్స్ కల్పిస్తాం.60 ఇయర్స్ దాటిన వారందరు HCA లో పదవి విరమణ చెయ్యాలి.డ్యూ స్ అన్ని క్లియర్ చేస్తామని శేష్ నారాయన్‌ తెలిపారు.

ఆదర్శ అయ్యూబ్ మాట్లాడుతూ.. నిన్న AGM సమావేశం జరిగింది. అన్ని అంశాలపై చర్చించాం. లోదా రూల్స్ ని అన్నింటిని ఆమోదించాం.ఇందులో వివేక్‌ని బీసీసీఐకి HCA రిప్రసేంట్‌గా ఎన్నుకోలేదని ఆదర్శ అన్నారు.సెప్టెంబర్1న HCA ఎలక్షన్స్ నిర్వహిస్తామని.. జూనియర్ సెలక్షన్ కమిటీ నిన్న AGM లో ఎన్నుకున్నాం.క్రికెట్ అభివృద్ధి కోసం ఎవరు కృషి చేయట్లేదు. కానీ ఇప్పుడు మేము ముందుకొచ్చా మని ఆయన అన్నారు. అందరూ అకాడమీలు పెడుతుంటే… ఎలాంటి రిసన్స్ లేకుండా HCA అకాడమీని క్లోజ్ చేసింది. మేము మళ్ళీ ఓపెన్ చేస్తాం.అని ఆదర్శ అయ్యూబ్ అన్నారు.

అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. COA ప్రకారం… HCA నుంచి బీసీసీఐ కి రిపర్సెంట్ ని ఎన్నికల తర్వాత ఎన్నుకోవాలి.కొంతమంది కావాలని ఇలా తప్పు లు చేస్తున్నారు. వివేక్ ఒక డాక్టర్ అయి ఉండి.. ఎథిక్స్ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. అని అజారుద్దీన్‌ అన్నారు.

- Advertisement -