విభజనకు ముందడుగు..

229
HC judges opt for AP or Telangana in bifurcation run-up
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు మూడున్నరేళ్ళవుతున్నా.. ఇంతవరకు ఉమ్మడి హైకోర్టు విభజన జరగలేదు. కానీ ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందడుగు పడింది.  ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వైపు నుంచి లాంఛనాలను పూర్తి చేయడం ప్రారంభించింది.

ఈ ప్రక్రియ తొలి దశలో భాగంగా అత్యంత కీలకమైన న్యాయమూర్తుల ఆప్షన్లకు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో ఉభయ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను కూడా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 37 మంది న్యాయమూర్తులను, తెలంగాణ రాష్ట్రానికి 24 మంది న్యాయమూర్తులను ఖరారు చేసింది.

ఇక తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిన పోస్టులలో 18మంది  శాశ్వత న్యాయమూర్తులు, 6 మంది అధనపు న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా.. ఏపికి 28మంది  శాశ్వత న్యాయమూర్తులు, 9 మంది అధనపు న్యాయమూర్తులు ఉంటారు.

తెలంగాణకు కేటాయించిన వారు :

1. జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి (ప్రస్తుతం గుజరాత్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు) 2. జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి 3. జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు (ఆగస్టులో పదవీ విరమణ చేశారు) 4. జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ 5. జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు 6. జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి 7. జస్టిస్‌ పి.నవీన్‌రావు 8. జస్టిస్‌ చల్లా కోదండరాం 9. జస్టిస్‌ బి.శివశంకరరావు 10. జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌ 11. జస్టిస్‌ అనీస్‌ (గత వారం పదవీ విరమణ చేశారు) 12. జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ 13. జస్టిస్‌ పి.కేశవరావు 14. జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి 15. జస్టిస్‌
డి.అమరనాథ్‌ గౌడ్‌

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారు :

1. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ (తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి) 2. జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ 3. జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ 4. జస్టిస్‌ ఎ.వి.శేషసాయి 5. జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు 6. జస్టిస్‌ డి.శేషాద్రినాయుడు (ప్రస్తుతం కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు) 7. జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి 8. జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌రావు 9. జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి 10. జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి 11. జస్టిస్‌ ఎ.శంకర నారాయణ 12. జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ 13. జస్టిస్‌ జె.ఉమాదేవి 14. జస్టిస్‌ ఎన్‌.బాలయోగి 15. జస్టిస్‌ టి.రజని 16. జస్టిస్‌ డీవిఎస్‌ఎస్‌ సోమయాజులు 17. జస్టిస్‌ కె.విజయలక్ష్మి 18. జస్టిస్‌ ఎం.గంగారావు.

వీరిలో జస్టిస్ డి.శేషాద్రినాయుడు కొద్ది రోజుల క్రితమే కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్ళారు.

ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన జరిగేంతవరకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు కేటాయించిన న్యాయమూర్తులు అందరూ యధాప్రకారం రెండు రాష్ట్రాలకు సంబందించిన అన్ని కేసులను చూస్తారని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.

- Advertisement -