శశికళ..పళని ల మద్య ‘రెండాకుల’ లొల్లి..

263
Sasikala petition to EC, alleges 'forgery and fabrication'
- Advertisement -

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేరం నిరూపితమై, ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ మొదటిసారి సీఎం పళనిస్వామి పై ఫైర్‌ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు ‘రెండాకులు’ తమకే చెందాలని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఈసీని ఆశ్రయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది శశికళ.

Sasikala petition to EC, alleges 'forgery and fabrication'

ఇప్పటికే తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న పళనిస్వామి కూడా ఎదురుదెబ్బ కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆమె, ఈ వ్యవహారంతో పళని పై ఫైర్‌ అవక తప్పలేదు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ, రెండాకుల గుర్తు కోసం వారు తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించారని ఆరోపించారు.

 Sasikala petition to EC, alleges 'forgery and fabrication'

రెండాకుల గుర్తు పోతే, రాజకీయ మనుగడ ప్రశ్రార్థకం అవుతుందని భావిస్తున్న ఆమె, ఎడపాడి, పన్నీర్ దాఖలు చేసిన 1877 ప్రమాణ పత్రాల్లో 329 నకిలీ ప్రమాణాలు ఉన్నాయని ఈసీకి లేఖను పంపారు.

నకిలీ పత్రాలు సమర్పించినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చాలా మంది సంతకాలను వీరు ఫోర్జరీ చేశారని శశికళ ఆరోపించారు. కాగా, ఈ నెల 30న ఈసీ  తుది విచారణ జరిపి రెండాకులు ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తేలుస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -