టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఫీట్ నమోదైంది. అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో భాగంగా కాబుల్ జ్వనాస్ జట్టుకు చెందిన అప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జజాయ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాధి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్,గ్యారి ఫీల్డ్ సోబర్స్,రవిశాస్త్రి అందుకోగా వారి జాబితాలో నిలిచాడు హజ్రతుల్లా.
బల్ఖ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ అబ్దుల్లా మజారి వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో హజ్రతుల్లా వరుసగా 6, 6, వైడ్, 6, 6, 6, 6లుగా మలిచి 37 పరుగులు సాధించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యువరాజ్ (2007లో ఇంగ్లండ్‌పై), క్రిస్ గేల్ (2016 బిగ్‌బాష్ లీగ్‌లో) సరసన నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కాబుల్ జ్వనాస్ ఓడిపోవడం విశేషం. తొలుత బ్యాటింగ్ బల్ఖ్ లెజెండ్స్ చేసిన క్రిస్ గేల్ సునామీ ధాటికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. గేల్ 80(48 బంతుల్లో 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కాబుల్ జ్వనాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా 67 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు.